తిరుపతి జిల్లా కలెక్టర్ తో సమావేశమైన ఎంపీ గురుమూర్తి

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో తాను తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన విషయాలపై చర్చించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణ రెడ్డి గారితో ఎంపీ గురుమూర్తి గారు సమావేశమయ్యారు.

సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశం లో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు ఎంపీ గారు తెలియజేసారు ఇందులో ముఖ్యంగా ఐటీ కాన్సెప్ట్ సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్, అంభేద్కర్  నవోదయ విద్యాలయాలకి  భూ కేటాయింపులు చేయాలనీ కలెక్టర్ గారిని కోరినట్టు తెలియజేసారు. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కేటాయించిన సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని,  అభివృద్ధి కార్యక్రమాలకి చెందిన సమస్యలు మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టరు గారిని కోరినట్టు ఎంపీ గారు చెప్పారు. అలాగే తన కార్యాలయంలో స్వీకరించిన పలు సమస్యలకి సంబందించిన వినతి పాత్రలను సత్వర పరిష్కారానికి కలెక్టరు గారికి అందజేశారు.