బిఎస్ఎన్ఎల్ అధికారులతో ఎంపీ గురుమూర్తి సమావేశం
బిఎస్ఎన్ఎల్ అధికారులతో ఎంపీ గురుమూర్తి సమావేశం
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతిలోని ఆయన కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వాకాడు మండలం పూడిరాయదొరువు, తడ మండలం ఇరకం, నాగలాపురం మండలం నందనం గ్రామాలలో నిర్మించ తలపెట్టి పెండింగులో ఉన్నటు వంటి బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్ల గూర్చి ఎంపీ గురుమూర్తి వారిని అడిగి తెలుసుకొన్నారు. పూడిరాయదొరువు, ఇరకం గ్రామాలకి సంబందించి వైల్డ్ లైఫ్ నుంచి అనుమతులు అలాగే నాగలాపురం మండలం నందనం గ్రామానికి సంబందించి పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేసారు పూడి రాయదొరువు, ఇరకం గ్రామాలకి రెండు టవర్లకి సంబంధించి వైల్డ్ లైఫ్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. వీటి తోపాటుగా నందనం టవర్ కూడా త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని వారిని కోరారు. స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ “౩జి” టవర్లను నుంచి “4జి” టవర్లుగా మార్చే ప్రక్రియలో మొదటగా తిరుపతిని ఎంపిక చేసారని త్వరలో ఈ పనులు మొదలవుతాయని బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎంపీ గురుమూర్తికి వివరించారు. స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ౩జి టవర్లను నుంచి 4జి కి మార్చే ప్రక్రియలో మొదటగా తిరుపతిని ఎంపిక చేసారని త్వరలో ఈ పనులు మొదలవుతాయని బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎంపీ గురుమూర్తికి వివరించారు. తదుపరి ఎంపీ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రస్తుత జనాభా అయిదు లక్షల కంటే ఎక్కువ ఉన్నారని, ఇంటి అద్దె కూడా ఎక్కువగా ఉన్న దృష్ట్యా తిరుపతి పట్టణాన్ని "జడ్" కేటగిరి నుండి "వై" కేటగిరి కి మార్పు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉపయుక్తంగా ఉంటుందని ఇందుకు సంబంధించి ఇది వరకే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడామని మరోసారి వారిని కలిసి విన్నవిస్తామని వారికీ తెలియజేసారు.