కరాది వెంకట శేషారెడ్డి పార్థివదేహానికి నివాళులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి 




నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 22 : 

నెల్లూరు నగరం లోని 14 వ డివిజన్ ఏసీ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రసాద్ రెడ్డి  తండ్రి  అయినా  కరాది వెంకట శేషారెడ్డి మరణించడంతో వారి పార్థివ దేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ  ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరాది వెంకట శేషారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రశేఖర్ రెడ్డి  భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు. అక్కడకు విచ్చేసిన స్థానిక వైసిపి నేతలను కలిసుకొని మాట్లాడారు.