ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి మునిసిపల్ నిధులు తాకం మునిసిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష .




రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


సూళ్లూరుపేట మున్సిపాలిటీ లో అభివృద్ధి పనుల కోసం తాము మునిసిపల్ నిధులను 

ఖర్చు చేయమని ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తామని 

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడించారు,శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద మునిసిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునిసిపాలిటీల్లో ప్రధానముగా త్రాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడం 

జరిగిందని, షార్ యాజమాన్యం సహకారం తో మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్ని పనులను ప్రతిపాదించనున్నట్లు, త్వరలో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియజేసారు,

అలాగే నియోజకవర్గం ఇంచార్జి నెలవల సుభ్రమణ్యం మాట్లాడుతూ మునిసిపల్ కౌన్సిల్  సభ్యుల అనుగుణంగా వారు మునిసిపల్  నిధులను ఖర్చుచేసుకోవచ్చునని వాటి గురించి 

మేము ప్రశ్నించమని అన్నారు, టిడ్కో ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసి లబ్దారులకు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధి మా లక్షంగా 

ముందుకుపోతామని ఆయన తెలియజెసారు. ఈ సమావేశం లో టీడీపీ అధికార ప్రతినిధి 

తిరుమూరు సుధాకర్ రెడ్డి ,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్,టీడీపీ నేతలు అలవల శ్రీనివాసులు,మాధవ్ తదితరులు పాల్గొన్నారు.