కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

గత పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. 

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 




ముత్తుకూరు, ఫిబ్రవరి 5(మేజర్ న్యూస్) గత ప్రభుత్వ పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం వల్లూరు గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఎమ్మెల్యే నిర్వహించారు. ఐదు లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సుమారు పది లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తయిన పశువైద్యశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. స్థానిక అధికార పార్టీ నాయకులు వల్లూరు మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎమ్మెల్యే చేశారు. ఈ సందర్భంగా ఆయన ఐదు పనులకు ఆమోదం తెలుపుతూ మంజూరు అయ్యేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా 37 మందికి ఇంటి నివేశ ఆధీన ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు . గిరిజన సంక్షేమమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. అవసరమైన ఆధార్ తో పాటు రేషన్ కార్డులుమంజూరు అయ్యేవిధంగా ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మల్లికార్జున యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్, పార్టీ నాయకులు రామ్మోహన్ రెడ్డి,శీనయ్య , ఏడుకొండలు, షఫీ, షేక్ అలిముత్తు, నాగేంద్ర ,సతీష్, మాజీ ఎంపీపీ దీనయ్య , ఎంపీడీవో నాగమణి, పంచాయతీ కార్యదర్శి భారతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు