నూతన డీజీపీ ని నివాసంలో కలిసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి




రాష్ట్ర పోలీసు డీజీపీ కేవ రాజేంద్రనాథ్ రెడ్డి తో వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు ఉన్న నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయం అమరావతి లో ఆయన నివాసానికి వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

జిల్లాలు పునర్వ్యవస్థీకరణలో లో భాగంగా కొత్త జిల్లాలు ఆవిర్భవిస్తున్న నేపధ్యంలో కావలి పట్టణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డీజీపీ కి వివరించారు

రామాయపట్నం పోర్టు, దామవరం ఎయిర్ పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కావలి ఇండస్ట్రీయల్ హబ్ లకు పరిపాలనా కేంద్రం గా కావలి పట్టణం రూపుదిద్దుకోనున్నదని డీజీపీ కి వివరించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాలకు రాకపోకలు సాగించడానికి కావలి పట్టణం ముఖ ద్వారం అయిందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డీజీపీ కి తెలియజేశారు

కీలకమైన జాతీయ రహదారులు, సముద్ర రవాణా, విమానయానం లకు కావలి పట్టణం కేంద్రం కానున్నదని డీజీపీ కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు

భౌగోళికం సువిశాల విస్తీర్ణం తో విభిన్నమైన నైసర్గికస్థితిని కలిగి ఉన్న కందుకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు ప్రధాన పట్టణం కావలి అని డీజీపీ కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వివరించారు

అన్ని రకాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న కావలి కేంద్రం గా జిల్లా ఎస్పీ అధికారి పర్యవేక్షణలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డీజీపీ కి తెలిపారు

పోలీసు శాఖ కు అవసరమైన భవనాలు, సువిశాలమైన స్థలాలు, భూములు కావలి లో అందుబాటులో ఉన్నాయని డీజీపీ కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వివరించారు

కొత్త జిల్లాల్లో భాగంగా కావలి లో నెల్లూరు రూరల్ ఎస్పీ కేంద్రం ఏర్పాటు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విన్నవించి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు

ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేసిన అన్ని అంశాలను ఆసక్తి గా ఆలకించిన డీజీపీ సానుకూలంగా స్పందించి డీజీపీ .... కావలి పై తనకు కూడా అవగాహన ఉందని.... మంచి నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో అన్నారు