ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి





కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నెల్లూరు ఎస్పి కృష్ణకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం పొదలకూరు రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కోవూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్ వద్ద సెలవు దినాల్లో అదనపు భద్రతపై చర్చించారు. కోవూరులో మహిళల సంరక్షణపై తక్షణమే స్పందించేలా కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించాలని కోరారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని కోరారు. ఎస్పీని కలిసినవారిలో టీడీపీ నాయకులు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, జెట్టి రాజగోపాల్‌ రెడ్డి, మదన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.