బుచ్చి వైస్ ఛైర్మన్లు టిడిపి వశం-కింగ్ మేకర్ గా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
బుచ్చి వైస్ ఛైర్మన్లు టిడిపి వశం-కింగ్ మేకర్ గా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
వైస్ ఛైర్మన్లుగా గెలుపొందిన టిడిపి బలపరిచిన యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్
ఇది ముఖమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన విజయం
పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం ,మేజర్ న్యూస్:
ఉత్కంఠభరితంగా మారిన బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 8 వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్ ఖాన్, 9 వ వార్డు కౌన్సిలర్ యరటపల్లి శివకుమార్ రెడ్డిలు వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు వున్న బుచ్చి నగర పంచాయతీలో టిడిపి బలపరిచిన పఠాన్ నస్రీన్ ఖాన్, యరటపల్లి శివకుమార్ రెడ్డిలు వైసిపి వైస్ చైర్మన్ అభ్యర్థులు కందుకూరు యానాది రెడ్డి, ప్రమీలమ్మలపై 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదాలో తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.బుచ్చి నగర పంవ్హాయతిలో వైస్ చైర్మన్ల గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజయంగా అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు జనరంజక పాలనకు ఆకర్షితులై బుచ్చి వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేశారన్నారు. ప్రజలతో మమేకమై పని చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని గెలుపొందిన వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ప్రజలకోసం పని చేసి పదవులకు వన్నె తేవాలని వైస్ చైర్మన్లుగా ఎన్నికైన యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్ గార్లకు సూచించారు.బుచ్చి పట్టణ అభివృద్ధి దిశగా అడుగులేయాలని కోరారు. పదవులు రాని వారు నిరుత్సాహ పడవద్దని అర్హులకు తప్పక న్యాయం చేస్తానని హామీ యిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికై తాను నిత్యం అందుబాటులో వుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, తెలుగుదేశం నాయకులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ, యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, అడపాల అనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.