ఎమ్మెల్సీ ఎన్నికలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

రవి కిరణాలు,నాయుడుపేట, మార్చి 25:-

  నాయుడుపేటపట్టణంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల పై సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.  జరగబోయే 2029 ఎలక్షన్లలో గెలవబోయేది వైఎస్సార్సీపీ పార్టీ అని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్య మంత్రి గా ఆపడానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఆయన గెలుపు తధ్యం అని అన్నారు.  
                                        అయితే ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ గెలుపు ఎడారి లో ఎండ మావులు లాంటివని  వాటిని చూసి వయాసిస్సులు అనుకోవడం ప్రతిపక్షాల అమాయకత్వ మని  నాలుగు సంవత్సరాలు గా గెలుపును చూడక పోవడం తో ఆ మాత్రం గెలుపుకు ప్రతిపక్ష నాయకులు హడావుడి చేస్తున్నారని అసలు   ఎమ్మెల్సీ గెలుపు మీ నాయకులు ఎవరి వల్ల గెలిచారో ఆ గెలుపు ను ఎవరి ఖాతాలో వెయ్యాలో తెలియక వారిలో వారే వాదులు వేసుకుంటున్నారని అన్నారు.

 ఎన్ని పార్టీ లు కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని  దీనిని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.