మాంబట్టు సేజ్ లో నూతన పరిశ్రమకు భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

తడ, రవి కిరణాలు, మార్చి 22:-

తడ మండలం మంబట్టు పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేస్తున్న నూతన పరిశ్రమ కు గురువారం స్థానిక ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు కిలివేటి సంజీవయ్య భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన పరిశ్రమల ద్వారా మరెంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని  అన్నారు.
 రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు మరియు పలువురు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.