ఆపదలో ఉన్నవారికి అభయ హస్తం అందిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఆపదలో ఉన్నవారికి అభయ హస్తం అందిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
సూర్య మేజర్ న్యూస్
విజయవాడ వరదల్లో చిక్కుకొని సర్వం కోల్పోయిన వరద బాధితులకు నేనున్నాను అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అభయ హస్తము అందిస్తున్నారని పార్టీ కార్యాలయ కార్యదర్శి మాలేపాటి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం లోని అన్ని మండలాల నుంచి అందరి సహకారంతో పాల ప్యాకెట్లు, విరాళాలు ,పాలు, బియ్యం ,లాంటి వస్తువులు సేకరించి వరద బాధితులకు స్వయంగా ఎమ్మెల్యే సురేష్ నాయకులతో కలిసి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వరద బాధితులకు మనో ధైర్యాన్నిస్తూ ,ఆపదలో ఉన్నవారికి తన సొంత నిధులతో ఆహారం అందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు నాయకులు ముందుకు వచ్చి, తమ వంతు సాయం అందించి, వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని, ఆపద సమయంలో ఆదుకోవాల్సిన వైసిపి నాయకులు, తమ స్వార్థ రాజకీయం కోసం అసత్యాలు వల్లిస్తూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులను నిలదీస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఓ మనిషిలా రాజకీయాలను పక్కనపెట్టి, ఆపదలో ఉన్న వారికి గుప్పెడు అన్నం పెడితే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నెం మధు, తిరుమలరెడ్డి ,పెంచలనాయుడు ,రామకృష్ణారెడ్డి ,వంశీ ,అశోక్ నాయుడు ,తుమ్మల కిరణ్ ,మువ్వ శ్రీహరి ,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.