జిల్లా స్థాయి పోటీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామిరెడ్డి కార్తీక్ రెడ్డి.

రవి కిరణాలు,సూళ్లూరుపేట, మార్చి 29:-

జాతీయ ఉపకార వేతనానికి

చిన్నమాంబట్టు పాఠశాల  విద్యార్థులు ఎంపికయ్యారు.

 జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్- 2023(ఎన్  ఎమ్ ఎస్-2023) పరీక్షల్లో తిరుపతి జిల్లా తడ మండలం చిన్నమాంబట్టు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కామిరెడ్డి నారాయణరెడ్డి కుమారుడు 

8 వ తరగతి చదువుతున్న  కామిరెడ్డి కార్తీక్ రెడ్డి 115 మార్కులతో జిల్లా స్థాయిలో అత్యధిక  మార్కులు జాబితాలో రెండవ స్థానం సంపాదించారు.మన్నే శ్రావ్య 114 మార్కులతో జిల్లా స్థాయిలో మూడో అత్యధిక మార్కులు ,నల్లపాటి వర్షిత 111 మార్కులు ,కొల్లి పెంచల్ రెడ్డి 107 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్ డి  ఫణి వేణి, ఉపాధ్యాయులు అభినందించారు . ఈ పరీక్షలో ఎంపికైన  విద్యార్థులకు నాలుగు సంవత్సరాలు పాటు ఒక్కొక్కరికి ,ఒక్కొక్క సంవత్సరానికి 12 వేల రూపాయలు స్కాలర్షిప్ అందుతుందని ఉపాధ్యాయులు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజన, శైలజ,పా మీద, హసీనా, అనురాధ మాధవి, హరిత ,మంజుల, శ్రీనివాసులు మరియు రామమూర్తి విద్యార్థులను అభినందించారు.