తెలుగుదేశం  పార్టీ  సభ్యత్వ నమోదు  కార్యక్రమాన్ని ప్రారంభించిన మ్మెల్యే డా నెలవల విజయశ్రీ 






రవికిరణాలు తిరుపతి జిల్లా 

(సూళ్లూరుపేటనియోజకవర్గం) నాయుడుపేట:-


  పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ  టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని 

 శాసనసభ్యురాలు  డాక్టర్  నెలవల విజయశ్రీ  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  శాసన సభ్యురాలు మాట్లాడుతూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు  కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  2014 సంవత్సరంలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 2 లక్షల అందించే వారిని, ఇప్పుడు దానిని 5 లక్షలకు పెంచాలని తెలియజేశారు, అలాగే లక్ష రూపాయలతో పార్టీలో ఉన్న నాయకులందరూ శాశ్వత సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు, నియోజకవర్గంలో ఉన్న  ప్రతి ఒక్క బూత్,యూనిట్,క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో కొనసాగే నాయకులు చొరవ తీసుకొని  రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానం నిలపాలని ఆదేశించారు,పై కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మరియు మాజీ పార్లమెంటు సభ్యులు  నెలవల సుబ్రహ్మణ్యం , జిల్లా అధికార ప్రతినిధి  తిరుమూరు సుధాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ శిరసనం భేటీ  విజయభాస్కర్ రెడ్డి ,786 రఫీ, విజయ్ కుమార్ నాయుడు, చంద్రా రెడ్డి, బొమ్మన ఏకాంబరం, సంచి కృష్ణయ్య, వేమసాని శ్రీనివాస నాయుడు, ఆకుతోట రమేష్, కొక్కు శంకరయ్య, కామరెడ్డి మురళి రెడ్డి, రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు