విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి.




బోగోలు మేజర్ న్యూస్:-

బోగోలు మండలం సోమేశ్వరాపురం కమ్మపాలెం గ్రామంలో శ్రీ పోతురాజు స్వామీ సమేత పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు  దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పార్టీ నాయకులు.అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని  కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, టిడిపి నాయకులు కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, చిలకపాటి వెంకయ్య, కంచర్ల మాధవి, కండ్లగుంట్ల మధుబాబు నాయుడు,సంజన కోటారెడ్డి, ముల్లంగి మధు,మాల్యాద్రి, ఎం శ్రీనివాసులు,నాగరాజు, మాధవరావు, భోగ్యం ప్రభాకర్,ఎల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.