నెల్లూరు నగర కమిషనర్ గా సోమవారం ఉదయం జాహ్నవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు నగర కమిషనర్ గా ఉన్న దినేష్ కుమార్ ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

నెల్లూరు జిల్లా (హౌసింగ్ ) జాయింట్ కలెక్టర్ గా జాహ్నవి బాధ్యతలు నిర్వర్తించారు. నగర కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.