చంద్రబాబుస్పూర్తితో క్లీన్ అండ్ గ్రీన్ సాధనకు కృషి చేద్దాం
చంద్రబాబుస్పూర్తితో క్లీన్ అండ్ గ్రీన్ సాధనకు కృషి చేద్దాం
పరిసరాల శుభ్రత అనేది ప్రతి పౌరుడు ప్రాధమిక బాధ్యతగా స్వీకరించాలి
దోమలు వృద్ధి చెండడానికి కారణం మాత్రం అపరిశుభ్ర పరిసరాలే -వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి
ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళి
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్:
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచడం మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళి అన్నారు.
ఆంధ్ర – స్వచ్ఛ దివిస్" కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పై అవగాహన కల్పించేందుకై బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రనిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ తో కలిసి బుచ్చి పట్టణంలోని 11వ వార్డు వాసవి నగర్ లో ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రత గురించి వివరించారు. ఎరుపు మరియు ఆకుపచ్చ డస్ట్ బిన్స్ లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములై క్లీన్ అండ్ గ్రీన్ సాధనకు కృషి చేయాలని కోరారు. క్లీన్ ఎన్విరాన్‌మెంట్ వల్ల బాక్టీరియా, వైరస్‌లు వ్యాప్తి చెందకుండా వుంటాయన్నారు. చాలా మంది డస్ట్‌బిన్‌లో వేయాల్సిన తాగేసిన వాటర్ బాటిల్స్, యితర వ్యర్ధాలు వీధుల్లోనో..డ్రైనేజీ కాలవల్లోనో..వేయడం వలన డ్రైనేజ్ కాలువలలో మురుగు నీరు ప్రవాహానికి అంతరాయం ఏర్పడి దోమల వ్యాప్తికి కారణం అవుతుందన్నారు. ప్రజలు డెంగ్యూ,మలేరియా లాంటి రోగాల బారిన పడడానికి పరిశుభ్ర పరిసరాలే కారణమన్నారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్‌ను రాష్టాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం స్ఫూర్తిగా స్వీకరించి బుచ్చి పట్టణాన్ని రాష్టంలోనే పరిశుభ్ర పట్టణంగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “స్వఛ్ఛ - ఆంధ్ర స్వఛ్ఛ దివస్” కార్యక్రమంలో మీడియా,మెప్మా సిబ్బందికి ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రాచూరు సత్యనారాయణ, బెలూం మల్లారెడ్డి,కత్తి నాగరాజు, మెప్మా సిబ్బందితో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.