గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేద్దాం - ఉయ్యాల ప్రవీణ్
గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేద్దాం - ఉయ్యాల ప్రవీణ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట : నియోజకవర్గం పరిధిలోని దొరవారిసత్రం మండలంలోని బూదూరు గ్రామంలో అధిక సంఖ్యలో యువకులు జనసైనికుల వలె జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకోసం జనసేన పార్టీ లో చేరారు.
వారికీ కండువ కప్పి పార్టీలోకి సూళ్లూరుపేట నియోజక వర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు. ఆవుల రమణ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను గ్రామస్థాయిలో బలపరుస్తున్న బూదూరు గ్రామ జనసైనికులు మనందరికీ ఆదర్శం అని ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. గ్రామంలోనీ పెద్దలను శాలువాలను కప్పి సన్మానం చేశారు.
.ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మండల ఇంచార్జ్ ఆవుల రమణ పాల్గొన్నారు..