జనాభాను అరికడదాం! దేశ ప్రగతికి తోడ్పడుదాం!!

రవి కిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:-

 దేశ జనాభా పెరుగుదలను అరికడుదాం! దేశ ప్రగతికి తోడ్పడుదాం అంటూ నినాదాలు చేస్తూ వైద్య ఆరోగ్య సిబ్బందిర్యాలీ నిర్వహించారు. జులై నెల 11న ఏర్పాటుచేసిన ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని దొరవారి  సత్రం పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది మంగళవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆరోగ్య సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు  జనాభా నియంత్రణకు అవగాహనగా, పలు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం, ఒకే బిడ్డ హద్దు, ఇద్దరు వద్దు  అంటూ ర్యాలీ కొనసాగించారు, జనాభా అరికట్టడంలో  ఆరోగ్య సిబ్బంది ప్రధాన భూమిక వహించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. చైనా దేశ జనాభాను మించిపోయిన, మన దేశ జనాభాను తగ్గించాలంటే అందరూ కృషి ఎంతో అవసరమని వైద్యులుసూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు చైతన్య, పలని రాజ్, సి హెచ్ ఓ  సంపూర్ణమ్మ, పి.హెచ్.ఎన్ పద్మావతి, సూపర్వైజర్లు  మైధిలి, కిరణ్, పాల్గొన్నారు