ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం : సిపిఐ సిపిఎం

రవి కిరణాలు,సూళ్లూరుపేట ఏప్రిల్ 12:-

భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డదని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న మోడీ నియంతృత్వ పోకడల ద్వారా దేశంలో ప్రజలకు రక్షణ కరువైందని సూళ్లూరుపేట వామపక్షాల నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం సూళ్లూరుపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఏప్రిల్ 14 నుండి 30వ తారీకు వరకు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార భేరి పాదయాత్రల గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ అమిత్ షా ల  నాయకత్వంలో బిజెపి, ఆర్.ఎస్.ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజల మధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నదని మరోవైపు అదానీ ,అంబానీ లాంటి అతిసంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నదని ప్రశ్నించే వారిని నిరంకుశంగా అణచివేస్తున్నదని దుయ్యబట్టారు . దేశ ప్రజల ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను మనం కట్టిన పనులతో నిర్మించిన ప్రభుత్వం యొక్క పరిశ్రమలని, ఓడరేవులని, మనందరికీ అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్లకు ధారా దత్తం చేస్తున్న మోడీ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలను జయప్రదం చేయాలని కోరారు.


 ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి, సిపీఎం నాయకులు సాంబశివయ్య, సుధాకర్, వేణు ,సిపిఐ నాయకులు తొండ రమణయ్య, బాలు, కాసిం ,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు