ప్రభావాలకు లొంగక ఓటు హక్కు వినియోగించుకుందాం
- కార్పొరేషన్ ఉద్యోగుల ప్రతిజ్ఞ
నెల్లూరు, జనవరి 24, (రవికిరణాలు) : జాతీయ ఓటరు దినోత్సవం 25 జనవరిని పురస్కరించుకుని నగర పాలక సంస్థ ఉద్యోగులు ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ కమిషనర్ గోపి ఆధ్వర్యంలో కార్యాలయం ప్రాంగణంలో సిబ్బంది శుక్రవారం సమావేశమై " భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడుతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి వత్తిడులకు. ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని ప్రతినబూనారు. ఈ
సందర్భంగా నగర పాలక సంస్థ మేనేజర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కమిషనర్ పివివిస్ మూర్తిని 'బెస్ట్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్' గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ప్రశంసించారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎలక్షన్ విభాగం డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.