ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించండి నెలవల సుబ్రహ్మణ్యం.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మార్చి 03 (రవి కిరణాలు):-

 సూళ్లూరుపేట నియోజకవర్గం
 నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం లక్ష్మణ్ నగర్ నందు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.
అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి సలహాలు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నిటిని పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని భరోసామిచ్చారు. అనంతరం
లక్ష్మణ్ నగర్ మరియు బేరిపేట నందు గల పట్టభద్రులను కూడా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్ గారికి ఓటు వేయాలని ప్రచారం చేశారు.

అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం  మీడియాతో మాట్లాడుతూ.

ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాలు అంటూ పేదవాడు బతుకుల్లో కుదిబండలా ఈ ప్రభుత్వం తయారయిందని అన్నారు.
పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని పట్టబద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ నుడా డైరెక్టర్ గూడూరు రఘునాథ రెడ్డి తనయుడు గూడూరు సుధీర్ రెడ్డి, ప్రధాన  కార్యదర్శి నానా బాల సుబ్బారావు తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, తిరుపతి పార్లమెంట్ మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి బిట్రగుంట గీతారెడ్డి,పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి నారాయణ మరియు  దార్ల రాజేంద్ర, ఇమిడి సెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి రవి, కార్యనిర్వాహక కార్యదర్శి కొండూరు కృష్ణమూర్తి రాజు, కిషోర్ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు రహమాన్ పట్టణ మహిళా అధ్యక్షురాలు హైమావతి సులేమాన్ 14 వ వార్డు అధ్యక్షులు వాకిలివెంకటేశ్వర్లు బత్తల దినేష్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కాశీ నాగరాజు , తెలుగు యువత నాయకులు జయ  ప్రకాష్ మరియు దిలీప్ , పట్టణ టి యన్ ఎఫ్ స్ అధ్యక్షుడు  పునిత్  సాయి,మరియు  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.