బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని గెలిపించండి ...

రవికిరణాల న్యూస్... తిరుపతి జిల్లా... దొరవారి సత్రం మండలం...
 

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని తిరుపతి జిల్లా బిజెపి కార్యదర్శి ఆశ  చెంచుకృష్ణయ్య  కోరారు. మంగళవారం దొరవారిసత్రం మండలంలో  స్థానిక బిజెపి నాయకులతో కలిసి  ప్రచారం నిర్వహించారు.మండలంలోని ఏకోల్లు,పూలతోట,కల్లూరు, కొత్తపల్లి సచివాలయాలకు వెళ్ళి అధికారులను మొదటి ప్రాదాన్యత ఓటు బిజెపిఅభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి వేసి గెలిపించాలని  అభ్యర్థించారు. వడ్డికండ్రిగ,కొత్తపల్లి గ్రామలలో ప్రచారం నిర్వహించి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కు మొదటి ప్రధాన్యత ఓటు వెయ్యాలని కోరారు.ఆయన వెంట దొరవారిసత్రం మండల బిజెపి సీనియర్ నాయకులు ఓరింగం ఈశ్వరయ్య,మండల అధ్యక్షుడు చింతకాని వెంకటరమణయ్య నాయుడు,జిల్లా ఓబిసి మోర్చా కార్యదర్శి వల్లిపి.విద్యాసాగర్,జిల్లా బిజెవైమ్ కార్యదర్శి నరేష్,మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వేలూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.