తుమ్మలపెంట రోడ్డులో జరుగుతున్న పనులను పరిశీలించిన శాసనసభ్యులు కావ్య. 




కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో సోమవారం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తుమ్మలపెంట రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, నాణ్యత ప్రమాణాలను  పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ, అతి త్వరలోనే కావలి తుమ్మలపెంట ప్రారంభం కాబోతుందని కావలి రూరల్ ప్రాంత ప్రజలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని, నిరంతరము రూరల్ ప్రాంత వాసులు వ్యాపారం నిమిత్తం పనులు నిమిత్తం కావలి కి వస్తుంటారని గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో జరగకూడదనే ఉద్దేశంతోనే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబునాయుడు ఆశీస్సులతో కావలి పట్టణము, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.