సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.
బోగోలు మేజర్ న్యూస్:-
బోగోలు మండలం సోమేశ్వర పురం గ్రామంలో శుక్రవారం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,టిడిపి నాయకులు,గ్రామస్తులు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట కార్యక్రమం దాతలు బచ్చు కృష్ణ కుమార్ శ్రీమతి బచ్చు సంధ్యా దంపతులను ఎమ్మెల్యే అభినందించారు.అమర బచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్క ఆశయాల కోసం తమ్ముడు చేస్తున్న సేవ అద్భుతం అని అన్నారు.స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు.సోమేశ్వర పురం ప్రజలు చూపుతున్న అభిమానం ఎనలేనిదని తెలిపారు..ఈ కార్యక్రమంలో కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ చార్యులు, ఆలయ ఈఓ రాధాకృష్ణ, ఆలయ మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి,బోగోలు మండల టిడిపి అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ చీలకపాటి వేంకటేశ్వర్లు,కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రం శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, గట్టాల సుబ్బయ్య టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..