కందుకూరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు








కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం పండుగ వాతావరణం లో ప్రారంభించబడింది..


ముందుగా పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు గారు  లక్ష రూపాయలు తో  పార్టీ శాశ్వత  సభ్యత్వ కార్డును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదగా స్వీకరించడం జరిగింది..


కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పొడపాటి మల్లికార్జున గారు, కాకుమని బసవేశ్వరరావు గారు లక్ష రూపాయలతో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్డును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, పార్టీ మీద అభిమానంతో శాశ్వత సభ్యత్వం స్వీకరించిన ముగ్గురిని ఎమ్మెల్యే గారు అభినందించడం జరిగింది. 


పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది..


ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు కండ్రా మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, షేక్ మున్నా, గడ్డం మాలకొండయ్య, పొడపాటి మహేష్, మురారి శెట్టి సుధీర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..