పోలీసుల అమరవీరుల సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు..








కందుకూరు పట్టణంలోని పోలీసుల అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కందుకూరు సబ్ డివిజనల్ అధికారి సిహెచ్. వి బాలసుబ్రమణ్యం, సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు ఆధ్వర్యంలో  పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు  సంఘీభావ ర్యాలీ జరిగింది..


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు అంటే పోలీసులు శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు.. వారి విధుల నిర్వహణలో  తమ కుటుంబాలకు సైతం  దూరంగా ఉండి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీస్ విధులకు సహకరించే మనస్తత్వం కలిగి ఉండాలని ప్రజలను కోరారు.


 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం లో పోలీసులు శాంతి భద్రతను కాపాడటం తో పాటు, సమాజంలో ప్రతి ఒక్కరికి తాము అండగా  ఉన్నామనే విధంగా  తమ సేవలను అందజేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో  ప్రభుత్వం పోలీసు వ్యవస్థని మరింత బలోపేతం చేసి ప్రజలకు అనేక సేవలు అందించేలా  కృషి చేయనున్నట్లు  ఎమ్మెల్యే ఇంటూరి  నాగేశ్వరరావు తెలిపారు..


ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది..