ప్రజల ముంగిటకు న్యాయ సేవ న్యాయమూర్తి వాణి 

వికలాంగుల రక్షణ కోసం వీధుల్లో ప్రచారం 





నెల్లూరు (లీగల్)మేజర్ న్యూస్ 

ఒకప్పుడు న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కి యేళ్ళ తరబడి వేచి చూస్తే తప్ప న్యాయ సహాయం లభించని పరిస్థితి. ప్రస్తుతం న్యాయ సహాయం అందించేందుకు సాక్షాత్తు న్యాయమూర్తే ప్రజల ముంగిటకు వచ్చి న్యాయ సేవలు అందించడం విశేషం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి యామిని పర్యవేక్షణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే వాణి మంగళవారం నాడు స్థానిక డైకస్ రోడ్డు నందు వికలాంగ బాలబాలికల గుర్తింపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు సమాజంలో వికలాంగ బాలబాలికలకు సరైన వైద్యం ఆర్థిక సహకారం అక్షర జ్ఞానం లభించక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రాష్ట్ర హైకోర్టు దృష్టికి వచ్చింది దీంతో రాష్ట్ర హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశిస్తూ వికలాంగ బాల బాలికలను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులే స్వయంగా నగరాల్లో గ్రామాల్లో మండలాల్లో పర్యటించి వికలాంగ బాలబాలికలను గుర్తించి వారికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా విద్య వైద్యం అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది ఇందులో భాగంగా వికలాంగ బాలబాలికల కోసం న్యాయమూర్తి వాణి ఇంటింటి ప్రచారం  నిర్వహించారు బాల బాలికలకు అవసరమైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా బాల భవిత కేంద్రం ద్వారా అందిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు ప్రాథమిక దశలోనే  బాల బాలికలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని న్యాయమూర్తి వాణి సూచించారు మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వికలాంగ బాల బాలికలను  గుర్తించిన వారు నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని న్యాయమూర్తి  సూచించారు న్యాయమూర్తి వాణి స్వయంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సీనియర్ నాయకులు ఐ శ్రీనివాసరావు ఏఎస్ఐ సతీష్ బాబు పారా లీగల్ వాలంటీర్లు సి శ్రీనివాసులు పి సురేంద్ర అంగన్వాడి ఉపాధ్యాయులు సిహెచ్ సుధా డి ప్రసన్న లోక్ అదాలత్ కార్యాలయ సిబ్బంది లీలమ్మ సుమతి తదితరులు పాల్గొన్నారు.