సేవ ద్వారా నేర్చుకోవడం (సేవ సే సీకెన్)
సేవ ద్వారా నేర్చుకోవడం (సేవ సే సీకెన్)
భారత ప్రభుత్వం. యువజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ.
నెహ్రూ యువ కేంద్ర, నెల్లూరు. ఆధ్వర్యంలో శుక్రవారం, సేవ ద్వారా నేర్చుకోవడం (seva se seekhen) కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని సర్వజన ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిజిహెచ్ సూపరిండింటెంట్ డా.సిద్దా నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఆసక్తి కలిగిన నర్సింగ్ స్టూడెంట్స్ ని ఎంచుకొని, మై భారత్ పోర్టల్ లో అనుసంధానం చేసి, వారి ద్వారా 120 గంటలు (నెల రోజులు) వైద్య సేవలు అందించడం, తద్వారా యువతలో సేవా భావాన్ని పెంచడం, దేశభక్తి పెంచడం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. అడిషనల్ సూపరిండింటెంట్ షేక్ మస్తాన్ భాష మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అనునిత్యం యాక్సిడెంట్ కేసులు ట్రామా విభాగానికి వస్తుంటాయని, వారికి అత్యవసర చికిత్సలు అందించే దానికి నర్సులు ఎంతగానో ఉపయోగపడతారని, అదేవిధంగా సర్జరీ అయినటువంటి పేషెంట్లకు సకాలంలో మందులు అందజేసి వారికి స్వస్థత చేకూర్చే దానికి దోహదపడతారని, ఇంకా ఇన్వెస్టిగేషన్స్, ఎక్సరే, ఎమ్మారై, సిటి స్కాన్, ఫార్మకాలజీ నందు రద్దీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఏ.మహేంద్ర రెడ్డి, జిల్లా పి.హెచ్.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్, అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, నర్సింగ్ సూపరిండిండెంట్ గిరిజా, నెల్లూరు నర్సింగ్ స్కూల్ టూటర్స్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.