ప్రజా ప్రతినిధులను గౌరవించడం నేర్చుకోండి. 




మాజీ మంత్రి కాకాణికి అధికార పార్టీ సూచన. 

ముత్తుకూరు ,నవంబర్ 1(మేజర్ న్యూస్) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను గౌరవిస్తూ రాజకీయంగా విమర్శలు చేయడం నేర్చుకోవాలని ఏక వచనం చేస్తూ సంబోధిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మండల తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ జనరల్ సెక్రెటరీ నీలం మల్లికార్జున యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. రాష్ట్ర మంత్రి నారాయణ పై మాజీ మంత్రి కాకాణి ఏకవచనంతో విమర్శలు చేసి అగౌరవ పరిచినట్లు ఆయన తప్పు  పట్టారు. ఇంకా అధికార భ్రమలో ఉన్న కాకాణి విమర్శలు మానుకుంటే మంచిదని పార్టీ ప్రధాన కార్యదర్శి నీలం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి మండల పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు మునిరెడ్డి, మత్స్యకార కమిటీ విభాగం అధ్యక్షుడు ఏడుకొండలు, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ షఫీ ఉల్లా, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నియోజకవర్గం అధ్యక్షుడు శంకర్, బ్రహ్మ దేవి నాయకులు సతీష్ నాయుడు, నాగేంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు