అమరావతి, డిసెంబర్ 23, (రవికిరణాలు) : ఏపీ రాజధాని, హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. విధులు బహిష్కరించి సిటీ సివిల్ కోర్టు ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.