దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్
దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్
కేంద్ర ప్రభుత్వం నూతన భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్ అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వెల్లడించారు. నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెరుగైన జీవన సౌలభ్యం, సులభతర వ్యాపారానికి వీలుగా ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు.