వేములచేడు పంచాయతీలో పారిశుద్ధ్య లోపం
వేములచేడు పంచాయతీలో పారిశుద్ధ్య లోపం
సైదాపురం మండలం మేజర్ న్యూస్ :-
సైదాపురం మండలంలోని వేమలచేడు పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు లేకపోవడంతో గ్రామంలోని పలు వీధులలో మురికి నీరు రోడ్లపైనే సైడ్ కాలవలు లేక మురికి నీరు రోడ్లపై పార్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు చూసి చూసినట్టు వ్యవహరిస్తున్నారని పంచాయతీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తపరిచారు. పంచాయతీ పరిధిలో సైడ్ కాలవలు లేక ఎక్కడ నీరు అక్కడ నిలవడంతో మురికిగా తయారయ్యిన నీటిపై బ్యాక్టీరియా ఉత్పత్తి అయి తద్వారా ప్రజలకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని కనీసం పంచాయతీ అధికారులు మురికి నీరుగా ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిపై కనీసం బ్లీచింగ్ చెల్లె ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్ధమని . అయితే ఊరిలో ఎప్పటినుంచో ఉన్నటువంటి బోరు పాయింట్లను రిపేర్ చేయకపోగా బోర్లకు ఉన్నటువంటి సైడ్ కాలువలు పూడిపోయిన వైనం కనబడుతుందని ఉన్నటువంటి సైడ్ కాలువలను పూడిక తీయక నీరు రోడ్లపైకి పొర్లుతూ ఉన్న వైనం కనీసం ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ పరిధిలోని పారిశుధ్య లోపాలను గుర్తించి వాటిపై తన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తపరిచారు