ఎల్.టి.పి.లు ప్లానింగ్ లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఎల్.టి.పి.లు ప్లానింగ్ లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్)
నగర పాలక సంస్థ పరిధిలో నూతన భవన నిర్మాణాలకు లైసెన్సుడ్ టెక్నికల్ పర్సన్ (ఎల్.టి.పి) కార్పొరేషన్ భవన అనుమతుల కొరకు పొందపరచవలసిన పత్రములు అన్నియు తప్పనిసరిగా సమర్పించి తద్వారా కార్పొరేషన్ వారి అనుమతి పొందిన పిమ్మట భవన నిర్మాణం మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తదుపరి నగరపాలక సంస్థ అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని అలా కార్పొరేషన్ వారి ఉత్తర్వులు ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేసారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఎల్.టి.పి. లతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందిన భవన యజమానులు నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టేలా, వర్షపు నీరు భూమిలో ఇంకేలా ఇంకుడుగుంట తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, అనుమతి పొందిన భవన నిర్మాణానికి సంబంధించి సెట్ బ్యాక్స్ అనుమతి ప్రకారం వుండేలా పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా
అక్రమ నిర్మాణాలు జరగకుండా, రోడ్లను అక్రమిస్తూ మెట్ల , ర్యాంపులు నిర్మాణం జరగకుండా, వర్షపు నీరు డ్రైను కాలువల ద్వారా సాఫీగా ప్రవహించుటకుటకు వీలుగా రూపొందించి, నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన నిర్మాణాలను అన్ని భవన సముదాయాల్లో ప్రణాళికాబద్ధంగా జరిగేలా జాగ్రత్తలు వహించాలని కమిషనర్ ఆదేశించారు.
నూతన భవనాల నిర్మాణాల అనుమతులకు దరఖాస్తు చేసే సమయంలోనే ఏలాంటి ఉల్లంఘనలు లేకుండా సరి చూసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలను పరిశీలించి తప్పనిసరిగా ఆక్రమణలను తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఇదివరకే ఆదేశించియున్నామని కమిషనర్ స్పష్టం చేసారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వేణు, దశయ్య నుడా పి.ఓ. సుబ్బారావు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.