చెంగాళమ్మ ఆలయంలో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు.

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట, ఫిబ్రవరి 24 (రవి కిరణాలు):-

పట్టణంలోని కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో మూడు రోజుల నుండి జరుగుతున్న కుంబాభిషేకం మహోత్సవంలో భాగంగా శుక్రవారంతో  ముగిశాయి. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల మండపంలో స్వర్ణ విమాన గోపురంపై ప్రతిష్టించే శిఖర కళశాలకు  సుగంధ ద్రవ్యాలతో వేద పండితులచే అభిషేకాలు చేసి కలిశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వర్ణ విమాన గోపురం పై ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - ప్రశాంతి రెడ్డి దంపతులు వ్యవహరించారు. వీరితోపాటు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య , శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు, ఆలయ ఈవో ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి దంపతులు వ్యవహరించారు. అనంతరం కలిశాలలో ఉన్న తీర్థాన్ని అభిషేకం చేసి ఆలయానికి విచ్చేసిన భక్తులపై పులకించారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, కర్లపూడి సురేష్, వంకా దినేష్, బండి సునీత, ఓలేటి బాల సత్యనారాయణ, మన్నెముద్దుల పద్మజ, నాయుడు కుప్పం నాగమణి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, కళత్తూరు శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.