కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణపట్నం పోర్టు అధికారులు. పోర్టుప్రభావిత రైతులకు..... వ్యవసాయ పనిముట్లు పంపిణీ.
కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణపట్నం పోర్టు అధికారులు. పోర్టుప్రభావిత రైతులకు..... వ్యవసాయ పనిముట్లు పంపిణీ.
అదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సి ఈ ఓ జగదీష్ పటేల్.
ముత్తుకూరు, ఫిబ్రవరి 10( మేజర్ న్యూస్) కృష్ణపట్నం పోర్టు ప్రభావిత గ్రామాల రైతాంగానికిరైతు స్నేహబంధం ద్వారా అదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ జగదీష్ పటేల్ రైతులకు తన సూచనలు సలహాలు ఇచ్చారు. కృష్ణపట్నం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తో అనుసంధానం చేయబడిన రైతులకు ట్రాక్టర్, ఇ-రిక్షా, మోటారు అనుసంధాన పురుగుమందుల స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను అందజేశారు. సుమారు 250 మంది రైతులు హాజరు కావడం. అదాని ఫౌండేషన్ ద్వారా వేరుశనగ విత్తనాలు, జిప్సం, మోటరైజ్డ్ స్ప్రేయర్లు ఇచ్చినారు.నారికేళపల్లి, రామ్ నగర్, ఆర్కాట్ పాలెం , కృష్ణపట్నం పరిసర గ్రామాల రైతులకు సాయం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోకార్పొరేట్ వ్యవహారాలు అధికారి మృత్యుంజయ రామ్, హెచ్ ఆర్ అండ్ హెడ్ అడ్మిన్ అనురాగ్ ద్వివేది, సెక్యూరిటీ మేనేజర్ వెంకటేష్ భాస్కర్, కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ పి. సరళ, ఎడ్యుకేటర్ డి. రాధిక, తదితరులు పాల్గొన్నారు.