రెకమండేషన్లు లేని ఆలయం...

ప్రశాంత వాతావరణంలో సామాన్య భక్తులకు దర్శనం...

దట్ ఈజ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...

కోటంరెడ్డి నిర్ణయాలకు భక్తుల నీరాజనాలు...

నెల్లూరు దుర్గామిట్ట లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దశాబ్దాల కాలం తర్వాత రికమండేషన్లు లేని ఆలయంగా పేరు తెచ్చుకుంది. నాయకుడు కాదు, అధికారులు కాదు, ప్రముఖులు కాదు... ఎవరైనా సరే క్యూ లైన్ లో రావాల్సిందే... ఎంత పెద్ద వారి పేరు చెప్పినా ఆలయంలోకి నో ఎంట్రీ... ఇదంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే సాధ్యమైంది. రాజరాజేశ్వరి దేవస్థానం ప్రతిష్టించి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 48వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఏడాది అమ్మవారి ఆలయం పై దృష్టి పెట్టారు. సామాన్య భక్తుడు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎవరి రికమండేషన్లు లేకుండా నేరుగా 15 నిమిషాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విఐపి పేరుతో ఉన్న గేట్లకు తాళాలు వేసి తన జేబులో పెట్టుకున్నారు. దీంతో ఎవ్వరు వీఐపీ పేరుతో లోపలికి వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. సామాన్య భక్తుడు కూడా సంతోషిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎంత రద్దీ పెరిగినా 15 నుంచి 20 నిమిషాల లోపే అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తులు బయటకు వచ్చేస్తున్నారు. దీంతో మహిళా భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆలయాన్నే తాము కోరుకున్నామని గతంలో ఎవ్వరు చేయలేని పని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేశారంటూ నిరాజనాలు పలుకుతున్నారు...


పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి...

దేవి శరన్నవరాత్రులు అంటే నెల్లూరు నగర పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైకులు వంటి వాహనాల్లో భక్తులు ఆలయానికి వస్తారు. ప్రతి ఏడాది కార్లు బైకులు ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత పెద్ద విఐపి వచ్చిన సరే గాలిగోపురం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్దకు కారు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఆలయం పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రాంగణంలోని పార్కింగ్లో మాత్రమే వాహనాలను పార్క్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో రాజరాజేశ్వరి ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం దొరికింది. గతంలో ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ కొనుక్కొని మరీ...

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూటే సపరేటు... సామాన్య భక్తుడిలా ఆలయానికి వస్తున్న శ్రీధర్ రెడ్డి 100 రూపాయల టికెట్ను కొనుక్కుని మరి దర్శనానికి వెళ్తున్నారు. ఆలయానికి వచ్చే సమయంలో తన చుట్టుపక్కల అధికారులు కానీ, నాయకులు కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ ఎవరు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఆలయానికి రాగానే క్యూలైన్ల సందర్శన భక్తులకు సౌకర్యాలపై ఆరా తీసి నేరుగా భక్తులతోనే మాట్లాడి అనంతరం వంద రూపాయల టికెట్ కొని క్యూలైన్లో వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అమ్మవారి మాల వేసి దీక్షలో ఉన్న శ్రీధర్ రెడ్డి ఆలయంలో ఏర్పాటు చేసిన అష్టాదశ శక్తి పీఠాల అలంకారాల వద్ద భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ లోటుపాట్ల గురించి భక్తులతోనే నేరుగా చర్చిస్తున్నారు.

విఐపి పాస్ రద్దు దిశగా ఆలోచనలు...

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని ప్రముఖులు విఐపి కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సమయాలను వారికి కేటాయించారు. ఉదయం 12 గంటల నుంచి 1:00 వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు పాసులు ఇచ్చి దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే ఆదివారం నుంచి పాసులను రద్దు చేసే దిశగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆదివారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దీంతో భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. ఇక సోమవారం దుర్గాష్టమి, మంగళవారం మహర్నవమి, బుధవారం విజయదశమి కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరగనుండడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు వచ్చినా సరే ఉచిత దర్శనం, 30 రూపాయలు, 100 రూపాయల టికెట్లు తీసుకొని క్యూ లైన్ లో మాత్రమే వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 48 ఏళ్ల ఆలయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని చెప్పుకోవచ్చు. ఎవరికీ సాధ్యం కానీ గొప్ప నిర్ణయం శ్రీధర్ రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తుంది...


కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్ణయాలతో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నభూతో న భవిష్యత్ అన్న చందాన జరుగుతుండగా... భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు....