తగిన విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేయండి 

 విద్యుత్ శాఖ ఎస్ఈ కి, కోటంరెడ్డి వినతి గిరిధర్ రెడ్డి భేటీ




 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సబ్ స్టేషన్ లలో తగిన విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని టీడీపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ లోని అనేక సబ్ స్టేషన్ లలో అసిస్టెంట్ లైన్ మెన్ లు,  జూనియర్ లైన్ మెన్ ల కొరత ఎక్కువగా ఉందని దీంతో గ్రామాల్లో  విద్యుత్ సేవల్లో లోపాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తగిన విద్యుత్ సిబ్బందిని నియమించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అరవ శ్రీను, రసూల్ , ములుమూడి సర్పంచ్ కుండా కరుణాకర్, మండల కొఆప్షన్ మెంబర్ మీరా మొహిద్దిన్, టిడిపి నాయకులు అట్ల నరసయ్య, సోడం భాస్కర్, అబ్దుల్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.