చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నష్టపరిహారంఅందించడంలో అధికారుల విఫలం
డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి పేరు మిందా నమోదు
రైతులకు మంచి నష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో అందించాలి
సజ్జలను కోరిన పేర్నాటి
:చెన్నై- బెంగుళూరు కోస్టల్ కారిడార్ లో భూములను కోల్పోయిన భూ బాధితులు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరారు.
గురువారం అమరావతి తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారులుసజ్జల రామకృష్ణా రెడ్డిని క పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పేర్నాటి అనుచరులు, రైతులు మర్యాద పూర్వకంగా కలిసి తీర ప్రాంతంలోని సిబిఐసి (చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్)భూసేకరణలో రైతులకు సంబందించిన పలు సమస్యలుఆయన దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపక్షిపాతిప్రభుత్వంఅని,చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో జరుగుచున్న భూసేకరణ నష్టపరిహారం అధికారులు ఆ దించడంలో విఫలం అవుతున్నారుతెలిపారు.డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి వారి పేరుమీదుగా భూములను రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, ఈతప్పిదం అధికారులుదికాదా అనిఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నో సంవత్సరాలుగా సాగుచేయుచున్న రైతులపేర్లనుసాగుదారులగా గుర్తించకపోవటం రెవెన్యూ అధికారుల లోపంకాదా అని ప్రశ్నించారు,అదేమని రైతులు అడిగితే మీ పేర్లు రెవెన్యూ రికార్డులలో లేవు అని,మా ముందు రెవెన్యూ అధికారులు మీ పేర్లు నమోదు చేయలేదు అది మా తప్పా... అంటూ ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు చెప్పడం ఏమిటి అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆక్రమణ సాగు రైతులకు ఎంతో నష్టపరిహారం ఇస్తారా ఇంత వరకు అధికారులు ప్రకటించలేదుఅని,కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని రైతుల భూములు ఆక్వా కల్చర్సాగు,వరి,వేరుశనగ,సవక,ముంతమామిడి సాగు చేసే సారవంతమైన భూములు కలిగి ఉన్నారు తెలిపారు, అందువలన గత ప్రభుత్వాలు భూసేకరణ చేయాలి అంటే సరియైన నష్టపరిహారం ఇవ్వని కారణంగారైతులుఒప్పుకోలేదు అన్నారు, అందుకే ఆనాడు భూసేకరణ జరగలేదు అని ఆయన చెప్పారు.
జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి ని భూ బాధిత రైతులు కలిసి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది అన్నారు,సజ్జల సలహ మేరకు పట్టాకు 21,75,000,డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్, భూములకు 15,00,000 రుపాయలుగా అధికారులు నిర్ణయించారు అని వెల్లడించారు,కాని ఒకేసారి భూసేకరణ చేస్తామని చెప్పారు,కాని ఇప్పుడు దశలవారిగా భూసేకరణ అంటున్నారు అనీ ఈ లోపం ఏపీఐఐసి అధికారులదా లేదా రెవెన్యూ అధికారులకు అర్ధం కాక రైతులు తికమక పడుతున్నారు ఆయన చెప్పారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపి కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని భూసేకరణ చేయాలి అని కోరారు,రైతులకు న్యాయం చేయాలని,లేని పక్షంలో భూసేకరణ సజావుగా సాగేందుకు రైతులు సహకరించరు అనీ హెచ్చరించారు, రైతుల పక్షాన సజ్జల రామకృష్ణ రెడ్డి అధికారులతో చర్చించి రైతులకుమంచినష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో ఇప్పించవలసిందిగా సజ్జలను కోరడం జరిగింది అని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో సిద్దవరం సొసైటీ అధ్యక్షుడు పాదర్తి రాధా కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల రఘు, దువ్వూరు సాయి కృష్ణా రెడ్డి, వైసీపీ నేతలు ఉప్పల ప్రభాకర్ రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి, వెంకురెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.
నెల్లూరుజిల్లా వాకాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి మరియు వైసిపి సీనియర్ నాయకులు కొండరెడ్డి నందగోపాల్ రెడ్డి సతీమణి సౌజన్య రెడ్డిని రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా శనివారం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
కొండరెడ్డి సౌజన్య రెడ్డి రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితుల కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు,కొండరెడ్డి అభిమానులు,ప్రముఖులు కొండరెడ్డి సౌజన్య రెడ్డి కి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొండరెడ్డి సౌజన్య రెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,గూడూరుఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాం అన్నారు.
నెల్లూరుజిల్లా వాకాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి మరియు వైసిపి సీనియర్ నాయకులు కొండరెడ్డి నందగోపాల్ రెడ్డి సతీమణి సౌజన్య రెడ్డిని రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా శనివారం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
కొండరెడ్డి సౌజన్య రెడ్డి రాష్ట్ర పచ్చదనం & సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితుల కావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు,కొండరెడ్డి అభిమానులు,ప్రముఖులు కొండరెడ్డి సౌజన్య రెడ్డి కి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొండరెడ్డి సౌజన్య రెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,గూడూరుఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. డైరెక్టర్ల నియామకంలో నెల్లూరు జిల్లా కోట మండలంలోని పెద్ద కుటుంబానికి చెందిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, మాజీ
నల్లపరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట ఉంటూ పార్టీ బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారు, వినోద్ రెడ్డి తాత నల్లపరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ గురువు తండ్రి నల్లప రెడ్డి హారనాధ్ రెడ్డి కూడా గ్రామ సర్పంచ్ నుండి జిల్లా రాజకీయాల్లో శాసించారు,వీరి ఇద్దరి వారసుడు గా వినోద్ రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేసి చిన్న వయసులోనే మండల పరిషత్ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టారు, ఆ తరువాత రాష్ట్ర స్థాయి పార్టీ పదవులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన సేవలను గుర్తించిన వైసిపి అధిష్టానం వినోద్ రెడ్డి ని రాష్ట్ర రెడ్డి వెల్ఫేర్& డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారిచేయడం జరిగింది. దింతో నల్లప రెడ్డి అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు వినోద్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు,వినోద్ రెడ్డి బాబాయ్ నల్లప రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు
పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి తో బంధాన్ని నెమరు వేసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ప్రజలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న ఏ రోజు శ్యాం గర్వ పడలేదు
🔹ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా నియమించబడిన శ్రీమతి పేర్నేటి సుస్మితా రెడ్డి గారిని నేడు వారి నివాసంలో అభినందించి సన్మానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర వైసీపీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావ్..
🔹వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా కష్టపడుతూ,తన వంతు సహాయసహకారాలు అందించిన పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణికి సీడ్ కార్పోరేషన్ అప్పగించడం ఆనందనీయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
🔹ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన సీడ్ కార్పోరేషన్ చైర్ పర్సనుగా పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సతీమణి పేర్నేటి సుస్మితా రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
🔹తనను మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేసిన వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పుకుంటాను.పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీగూడూరు లోని చిట్టమూరు మండలం కొంతగుంట లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురు మూర్తి ప్రచారం .
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ అన్న నిలబెట్టిన డాక్టరు గురు మూర్తి నీ భారీ మెజారిటతో గెలిపించాలని కోరిన
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు..
హాజర అయిన మంత్రులు పేదిరెడ్డి , నారాయణ స్వామి ,టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ...
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
♦️ 3 వ తేదీ శనివారం ఉదయం వాకాడు నుండి కోట వరకు రన్ ఫర్ జీసస్
♦️ కోవిడ్ నిబంధనలు అనుసరించి రన్ ఫర్ జీసస్
♦️రన్ ఫర్ జీసస్ కు క్రైస్తవులు తరలిరావాలి
♦️ కోట,వాకాడు,చిట్టమూరు (కెవిసి) మండలాల పాస్టర్స్ & లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేము దినకర్ బాబు పిలుపు
క్రైస్తవుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 3 వ తేదీ శనివారం నాడు జరిగే రన్ ఫర్ జీసస్ కు క్రైస్తవులు తరలివచ్చి రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయాలని అనికోట,వాకాడు,చిట్టమూరు (కెవిసి) మండలాల పాస్టర్స్ & లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేము దినకర్ బాబు పిలుపునిచ్చారు.
శుక్రవారం వేము దినకర్ బాబు ఓ ప్రకటనలో పేర్కొంటూ విశ్వాసానికి శుభ శుక్రవారం సమయం మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడే ఓ భయంకరమైన దుర్ఘటన జరిగింది. మానవాళి సిగ్గుతో తల దించుకోవలసిన సంఘటన అది. ఈ దృశ్యం చూడలేక భూన బోంతరాలు దద్దరిల్లినవి. కొండలు పగిలాయి. దేవాలయంలో తెర రెండుగా చిరిగిన రోజది . దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును లోకానికి నరావతారిగా పంపాడు. అయితే అవినీతి పరులైన మతాధికారులు, దుష్టప్రజలు యేసు చెప్పిన పవిత్రమైన నీతిబోధలకు తాళలేక ఆయనను శిలువ వేసిన రోజది.
క్రీ.పూ 700 సంవత్సరాలు. యెహోవా అనే భక్తుడు ఈ దుస్సంఘటన గురించి ఇలా ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలే అతడిని (క్రీస్తు) గాయపరిచాయి. మన సమాధానార్థమైన శిక్ష అతనిపై పడింది. అతని దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతోంది. (యెష 53:5).
ఆకాశం, భూమి, సముద్రాలలోనున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపాలతో నశించే మానవులను కాపాడేందుకు యేసును భూమిపై అవతరింప జేసాడు. పవిత్ర రక్తం చిందిస్తేనే తప్ప వేరే మార్గంలో పాప విముక్తి కలుగదని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏసంటే రక్షకుడని క్రీస్తు అనగా అభిషిక్తుడని భావం. పాప పంకిలం నుండి నరుడు విముక్తి పొంది, పవిత్ర జీవితం గడిపి స్వర్గానికి బాట నిర్దేశించే నీతి నియమాలతో కూడిన ప్రణాళికను ప్రభువైన ఏసు విశదం చేశాడు. సాతాను ఏర్పరిచిన ధనం, కీర్తి, సౌఖ్యం, వినోదం, అశ్లీలతతో కూడిన లైంగికానందాలనే పంచరంగుల వలలో మానవుడు చిక్కుకున్నాడు.
ఆ వల నుండి నరుని విముక్తి చేయడమే ఏసుక్రీస్తు ధ్యేయం. ఆశతో ఎగబాకే ఆయా రంగాల్లో ఎంత ఉచ్చస్థితి సాధించినా హృదయానికి తృప్తి, మానసికానందం లభించడం లేదు. అవన్నీ దూరపు కొండలే కదా!ఏసు తానే దైవకుమారుణ్ణని చెప్పినా యూదులంగీకరించలేదు. అక్రమ సంపాదపరులైన మతాధిపతులు తమ అన్యాయార్జితం క్రీస్తు సద్బోధలతో ఎక్కడ దూరమవుతుందోనని భయాందోళనలకు గురై ఎలాగైనా క్రీస్తును చంపేందుకే కుట్ర పన్నారు. తత్ఫలితంగా న్యాయాధికారి పిలాతు కు తప్పుడు సాక్ష్య నివేదిక సమర్పించారు.
ఆనాటి ఇశ్రాయేలీయుల రాజైన హేరోదుపై కూడా క్రీస్తును అంతం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో చెయ్యని నేరాన్ని పవిత్రుడైన ఏసుపై ఆపాదించి శిక్షకు పరాకాష్ట అయిన శిలువ మరణమనే శిక్ష వేశారు. ఆ విధంగా శిలువ మరణం పొంది, తాను చెప్పిన ప్రకారం సమాధి చేధించుకుని మూడోనాడు ఏసు మృత్యుంజయుడై లేచి వచ్చాడు. ఆ రోజే గుడ్‌ఫ్రైడే. శుభ శుక్రవారం. సమాధి లోనుండి ప్రభువు తిరిగి లేచిన మూడవ రోజు ఆదివారం. దానినే ఈస్టర్ పండుగ అని పిలుస్తారు. ఇది క్రైస్తవులకు గొప్ప పండుగ.
ప్రపంచమంతా వారంలో ఒక్కరోజు (ఆదివారం) అన్ని వ్యాపారాలు, పనులు మాని జనులు గుంపులుగా, సమూహాలుగా కూడి ఆయనను ఆరాధించేందుకు వెడతారు. ‘‘చివరిగా చెప్పాలంటే, ఏసుక్రీస్తు మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని పొందేందుకు మనం ప్రయాసపడాల్సిందేమీ లేదు. ఆయన్ను విశ్వసించడం తప్ప.
అందుకే ఏసు గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు క్రైస్తవులు ఎప్పుడూ ముందు ఉంటారు అనీ, ఆ నేపథ్యంలో క్రైస్తవుల ఐక్యత చాటేందుకు గత కొన్ని సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ ఏడాది కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాకాడులోని అశోక్ స్థూపం నుండి శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కోట పట్టణంలో ని క్రాస్ రోడ్డు వద్ద ముగుస్తుంది అన్నారు,ఈ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పోలీసులు నిబంధనలు ప్రకారం నిర్వహిస్తున్నట్లు దినకర్ బాబు వెల్లడించారు.
⚪ ఇటీవల చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం
🟢 రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాను
⚪ కుటిల రాజకీయాలకు ఇంక నుండి దూరం
గూడూరు పట్టణ ప్రజల కోసం,గూడూరు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఎవరూ ఊహించని విధంగా* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు గురువారం హరిశ్చంద్ర రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ,పార్టీ కోసం శ్రమిస్తున్న కూడా అసత్యపు ఆరోపణలు చేయడం,తన దుష్ప్రచారం చేయడం వంటి ఎన్నో పరిణామాలు తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరిశ్చంద్ర రెడ్డి వెల్లడించారు.
చెన్నై నుంచి హరిశ్చంద్ర రెడ్డి మాట్లాడుతూరాజకీయాలకు తాను కరెక్ట్ కాదేమో .. పొరపాటున వచ్చినట్లు ఉన్నానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు తెలియదు. ఈ రంగంలో ఉండలేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన వరుస దురదృష్టకర ఘటనల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తన వల్ల గూడూరు ప్రజలకు ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని విధాలుగా తనకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు ప్రజలకు, పార్టీ అధినేత సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ తన అభిప్రాయాన్ని ముగించారు.
తాను గూడూరు ప్రజల సేవకుడు గా కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవలు చేస్తాను అనీ, రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు,హరిశ్చంద్ర రెడ్డి నిర్ణయం పట్ల వైసిపి నేతలు,కార్యకర్తలు, అభిమానులు నిరాశ నిసృహనికి లోను అయ్యారు,తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హరిశ్చంద్ర రెడ్డి నిర్ణయం గూడూరు లో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది.
రాప్తాడు శాసనసభ్యులు
గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్
తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
గూడూరు శాసనసభ్యులు
వెలగపూడి వరప్రసాద్ రావు గారు
నల్లపరెడ్డి రజత్ రెడ్డి గారు
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్
పి. రూప్ కుమార్ యాదవ్ గారు
నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్
వీరి చలపతిరావు గారు
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్
గొల్లపల్లి విజయకుమార్ గారు
Ysrcp రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిని శుక్రవారం అమరావతి వెలగపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోట మండలం లోని చెందొడు గ్రామానికి చెందిన గూడూరు నియోజకవర్గ వైసీపీ యువత అధ్యక్షుడు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి
💠 తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేయాలని మంత్రికి వినతిపత్రం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమ తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలను ఏర్పాటు చేయండి
💠 తోళ్ల పరిశ్రమ కు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పోరాటం చేసాం
💠 ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమను ఏర్పాటును రద్దు చేస్తాం- మంత్రి గౌతమ్ రెడ్డి
💠ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం
💠 మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి
నెల్లూరు : కోట మండలం లోని తీరప్రాంత గ్రామాలు కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ళ దొరువు గ్రామ సమీపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు మేము పూర్తి వ్యతిరేకం అనీ అవసరం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అనీ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు,
గురువారం నెల్లూరు లోని మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి అతిథి గృహంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్ గౌడ్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమను ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలకు,యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనీ వినతిపత్రం అందజేసీ కోరారు, వెంటనే స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేసి పొల్యూషన్ లేని ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమ ను ఏర్పాటు చేస్తాం అనీ పేర్నాటి కి హామీ ఇచ్చారు,
ఇప్పుడు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అనీ, అందువలన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్నీ విషయాలు క్షుణ్ణంగా వివరించాం అనీ, ఆయనకూడాసానుకూలంగా స్పందించి తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు,
గత కాంగ్రెస్ ప్రభుత్వం లో పునాదులు పడ్డ తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా 10 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి సుదీర్ఘ పోరాటాలు చేశాం అనీ తెలిపారు, గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు వైసీపీ అధికారంలోకి వస్తే తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అనీ ఈ సందర్భంగా పేర్నాటి గుర్తు చేశారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి కూడా తీరప్రాంత ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అని ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ప్రాణాలు అర్పించి తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకుంటాం
అత్యంత ప్రమాదకరమైన తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకొనేందు ఎంతటి పోరాటాలకు అయినా సిద్ధం అనీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు, అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమ కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం అన్నారు, ఒక్కసారి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు అయితే తీరప్రాంత ల్లో ఉన్న మత్స్యకారులు రోగాలు బారిన పడి జీవనోపాధి కోల్పోయి వీధిన పడే అవకాశాలు ఉన్నాయి అన్నారు, పరిశ్రమ వలన భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, పచ్చని పల్లెలు నాశనం అవుతాయి అనీ తెలిపారు,తనకు అధికారం ముఖ్యం కాదు అని ప్రజల సంక్షేమం ముఖ్యం అన్నారు.
కోట మండలం అల్లంపాడు గ్రామంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం
డివిజన్ లో 25 వేల మంది పేదలకు ఇంటి నివేశన స్థలాలుపంపిణీచేయడంజరుగుతుందన్నారు.అల్లంపాడు గ్రామం లో నాలుగు ఎకరాల పట్టా భూమిని పేదల ఇళ్ల స్థలాల కు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్యాంప్రసాద్ రెడ్డి నీ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు.,
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆచరిస్తూ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలిపారు,ఉన్న ఊరిని కన్న తల్లిని మరవను అనీ వెల్లడించారు.
గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉంటూ కూడా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు అన్నారు, ఈ నేపథ్యంలో అల్లంపాడు గ్రామంలో పేద ప్రజల కోసం 4 ఎకరాలు భూ దానం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీవో భవాని ,వైకాపా నాయకులు దువ్వూరు వెంకటరమణా రెడ్డి ,దువ్వూరు సాయి కృష్ణారెడ్డి ,పి రాజా రామ్ రెడ్డి ,మల్లం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి , పాదర్తి రాధకృష్ణా రెడ్డి,మాజీ కోట మండల జడ్పిటిసి సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ , వైకాపా నాయకులు ఇన్నమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ గౌడ్,వెంకు రెడ్డి,మధు రెడ్డి,సునిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం సబ్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న డిసెంబర్ 25 ఇంటి స్థలాల పంపిణీ పారదర్శకంగా పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా సిద్ధంగా ఉన్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కోట తాసిల్దార్ కార్యాలయంలో పాలు రికార్డ్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద వారికీ ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో కోట దళితవాడకు చెందిన కొంతమంది మహిళలు మాకు ఇంటి స్థలాలు లేవని మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కోరారు.
నెల్లూరు మూలపేట కొండదిబ్బ ప్రాంతంలో నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి చదువుల తల్లి సరస్వతీ దేవి వడిలో పెరిగిన యూ. ప్రవలళ్లిక చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి తిరుపతి పద్మావతీ వైద్యకళాశాలలో మెడిసిన్ సాధించి (MBBS)కాలేజీలో చేరడానికి హాస్టల్ ఫీజులుకు ఖర్చులకు డబ్బులు లేవని తనని ఆర్థికంగా ఆదుకోవాలని పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఒక్క చిన్న విన్నపము రాసుకోగా ఉదార హృదయంతో వెంటనే స్పందించి 40,000రూపాయలను ప్రవాళ్ళిక కు అందచేసిన మరోసారి తన దాతృత్వ హృదయానికి హద్దులు లేవని, సేవా కార్యక్రమాలుకు ప్రాంతాలు అడ్డురావని సేవా కార్యక్రమాలుకు అలుపులేదని నిరూపించుకున్నారని ప్రవళ్ళిక తో పాటు తన తల్లిదండ్రులు పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ కు పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.