కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లా గా కొనసాగించాలి.... సూళ్లూరుపేట బహుజన అన్ని సంఘాల ఐక్యవేదిక.

తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-

 స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద  నియోజకవర్గ  అంబేద్కర్ అభిమానులు బహుజన లైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మరియు ఉద్యోగులు ఉపాధ్యాయులు దళిత సంఘాల నాయకులు కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించినందుకు గాను ఆ జిల్లాలో కొందరు అగ్రకులానికి చెందిన మూర్ఖులు చేసిన హింసాకాండకు వ్యతిరేకిస్తూ నేడు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుల ,మత భేదం లేకుండా అందరూ విచ్చేసి మానహరంగా ఏర్పడి కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి  తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆవుల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చాలాచోట్ల రాజకీయ నాయకుల పేర్లు ను వైయస్సార్ జిల్లాగా, ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించారని కోనసీమ జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి కొంతమంది అగ్రకులాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల పై దాడులు చేసి  ఇళ్లను తగలబెట్టడం నేరమని వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు కన్నంబాకం మునస్వామి,రమేష్ బాబు, ఏ డి పి ఎస్ నాయకులు ఎర్రబోతుల సుబ్రహ్మణ్యం బహుజన సంఘాల నాయకులు తరులు పాల్గొన్నారు.