ఇంటి  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి




ఉదయగిరి మేజర్ న్యూస్.

దోమల వ్యాప్తి ద్వారా డెంగ్యూ, చికెన్ గు న్యా, విషపూరిత జ్వరాలు విజృంభించే  అవకాశం మెండుగా  ఉందని ఇంటితో పాటు,  చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా మలేరియా అధికారిణి హుస్సేనమ్మ తెలిపారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని శకునాలపల్లి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ను, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ వాసులతో  మాట్లాడుతూ మలేరియా,డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చేసే దోమల లార్వాలను నిర్మూలించవచ్చని ఆమె తెలిపారు. రాత్రిపూట దోమ కాటు నుండి రక్షణకు దోమతెరలు వాడాలని, ఇంటిల్లపాది వేపాకు పొగను వేసుకోవాలని పరిసర ప్రాంత ప్రజలను ఆమె కోరారు. ఇంటిం టి లార్వా సర్వేను పరిశీలించి ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించి ఓపిని పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని జ్వరం కేసులు నమోదవుతున్నాయి, రికార్డులు సక్రమంగా రాస్తున్నారా లేదా అని ఎం ల్ హెచ్ పి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విద్యాధికారి కలసపాటి వెంకటసుబ్బయ్య, ఉదయగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి నౌషద్ బాబు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది కే రాజేశ్వరి, డి చంద్రకళ,సుహాసిని, అనిత తదితరులు పాల్గొన్నారు.