క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కావలి శాసనసభ్యులు కావ్య.
క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కావలి శాసనసభ్యులు కావ్య.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణ మరియు నియోజకవర్గ క్రైస్తవ సోదరి, సోదర మణులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రీస్తుని హృదయమంతటితో ఆరాధించే వారికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన,కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచ యావత్తు క్రీస్తు పుట్టుక దినమును సుమారు 200 దేశాలలో ఈ క్రిస్మస్ పండుగను ఆరాధిస్తున్నారు. క్రీస్తుమన కొరకు మరణించి తిరిగి మన కొరకు జన్మించాడని, కాబట్టి ఆ దినమున క్రిస్మస్ జరుపుకుంటున్నాము అన్నారు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయన పుట్టిన దినమున క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా జరుపుతారని బైబిల్ లో చెప్పబడిన ప్రకారం వారు తెలిపారు. క్రీస్తు పుట్టుక ను క్రిస్మస్ అని తెలిపారు. ఈ క్రిస్మస్ దినమున ప్రతి క్రైస్తవులు నిండు మనస్సు తో ఏసుక్రీస్తుని ఆరాధిస్తారని మనము కూడా ఆయన ప్రేమ కలిగి, ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.