మహా చండీ యాగం కరపత్రాన్ని ఆవిష్కరించిన కావలి శాసనసభ్యులు కావ్య.
మహా చండీ యాగం కరపత్రాన్ని ఆవిష్కరించిన కావలి శాసనసభ్యులు కావ్య.
కావలి మేజర్ న్యూస్: కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెంలో ఫిబ్రవరి 12న నిర్వహించిన మహా చండీయాగానికి విచ్చేయవలసిందిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిని శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠములు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని శనివారం ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు పత్రి వీరబ్రహ్మయ్య ఆహ్వానించారు. అనంతరం మహా చండీ యాగం కు సంబంధించిన కరపత్రాన్ని శాసనసభ్యులు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజువారి చింతలపాలెంలో శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠంలో నిర్వహించే కార్యక్రమంలో కావలి నియోజకవర్గం ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మహా చండీయాగం విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు రాజువారి చింతలపాలెం సీనియర్ నాయకులు గుంటూరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.