డీఎస్పీ కి అభినందనలు తెలిపిన కావలి ఏరియా వైద్యశాల సూపర్నెంట్ మరియు సిబ్బంది 




కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో ఏరియా వైద్యశాలకు అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా డి.ఎస్.పి శ్రీధర్ చొరవ తీసుకొని ఏరియా వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 72 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు డిఎస్పి సహకారంతో అందించారు. అసలే ప్రభుత్వ వైద్యశాల ఇక్కడికి వచ్చు రోగులు పేదవారు కనీసం రక్తము తక్కువైన బాలింతలకు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కావలసిన రక్తం చాలా తక్కువగా ఉంటున్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇ టువంటి మంచి వ్యక్తికి గణతంత్ర దినోత్సవం రోజు తను చేసిన సేవలకు గాను పట్టణ శాంతి భద్రతల విషయంలోనూ విశిష్ట సేవా పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. ఇందుకుగాను ఏరియా వైద్యశాల సూపర్నెంట్ మరియు ఆర్ ఎం ఓ ప్రమీల, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విజయవాణి, డాక్టర్ ప్రణీత, బ్లడ్ వారియర్స్ టీం, నిర్వాకులు వినయ్, మహమ్మద్ అబ్దుల్ అలీమ్ తో కలిసి డిఎస్పీ కార్యాలయంలో తన చాంబర్లో ఆయన్ని  మొక్కను బహుకరించి అభినందించారు. అనంతరం డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, పోలీసులు ప్రజలపై అంకితభావంతో పనిచేస్తారని, అందులో భాగంగానే ప్రతి సంవత్సరం పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజున రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి తమ రక్తంతో ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ ఉన్నదని తెలిసి, ఏరియా వైద్యశాలకే రక్తం అందించాలని మా వంతు సహకారం అందించడం జరిగిందని తెలిపారు.