కరాటే వృత్తి కాదు...స్వయం సంరక్షణ విద్య - అబ్దుల్ అజీజ్








నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో సోమవారం షిటోరియో కరాటే డు ఇంటర్నేషనల్  జిల్లా ప్రధాన కార్యదర్శి గయాజ్ వారి శిష్యులతో కలిసి వారి యొక్క కరాటే నైపుణ్యాన్ని  నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ గారి ముందు ప్రదర్శించారు...

షిటోరియో కరాటే డు ఇంటర్నేషనల్ జిల్లా ప్రథాన కార్యదర్శి గయాజ్ గారిని అబ్దుల్ అజీజ్, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య గార్లు సన్మానించారు..వివిధ స్థాయి కరాటే పోటీల్లో విజయం సాధించిన చిన్నారులను అబ్దుల్ అజీజ్ గారు అభినందించారు...

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ....

కరాటే మాస్టర్ గాయాజ్ గారికి 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని, వేల మంది విద్యార్ధులకు కరాటే విద్య ను నేర్పించారు అన్నారు...షిటోరియో కరాటే డు ఇంటర్నేషనల్ అనేది ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ యొక్క అనుబంధ సంస్థ  అని అన్నారు...ఇక్కడికి వచ్చిన పిల్లల నైపుణ్యం చూస్తుంటే ముచ్చటగా ఉందని, గతంలో అందరూ ఇదొక ప్రత్యేకమైన విద్య లాగా,కొందరే నేర్చుకుంటారు అన్న భావన తో ఉండేవారని అన్నారు..కరాటే విద్య ఒక వృత్తి కాదని, అందరికీ ఇదొక స్వయం సంరక్షణ విద్య అన్నారు...ఆడపిల్లలు బయటకు వెళ్లి తిరిగి వచ్చేదాకా, త్లలితండ్రులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారనీ.. ప్రస్తుత పరిస్థితిలో ఆడపిల్లలకు ఇలాంటి విద్యలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు...ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని సూచించారు...ఇది సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాదు, శరీరంలోని అవయవాలను, బలపరుస్తూ ఎల్లపుడూ మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది అన్నారు..చిన్నతనం నుండే పిల్లలకు ఇలాంటి విద్యలు నేర్పడం వల్ల, పిల్లల మనసుల్లో తెలియని ఒక మనో ధైర్యం నింపిన వారం అవుతామని అన్నారు...లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా తొలిగాక, అందరూ తమ పిల్లలకు ఏదో ఒక విద్య లో నైపుణ్యం తీసుకునే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు...పై కార్యక్రమంలో జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, నన్నే సాహెబ్ ఆబీద సుల్తానా, సుబహాన్, పూల సుబ్రహ్మణ్యం, చెంచు కిషోర్ తదితరులు పాల్గొన్నారు...