టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి మంగళగిరి
మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణది ప్రత్యేక స్థానమని, విద్యార్థి దశ నుంచే కన్నా రాజకీయాల్లో ఉన్నారని, మంత్రిగా మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను చూశానని, పదేళ్లపాటు ముగ్గురు సీఎంల వద్ద కన్నా పనిచేశారని, కన్నాను ఓడించడం తనకు కూడా సాధ్యం కాలేదని, టిడిపిలో కన్నా చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా పనిచేయడంలో కన్నా లక్ష్మీనారాయణ ఒక గొప్ప నాయకుడని చంద్రబాబు నాయుడు కొనియాడారు.