మాలకొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ...








వలేటివారిపాలెం మండలం మాలకొండలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు జరగవలసిన అభివృద్ధి పనులపై శుక్రవారం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు మాలకొండపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం జరగవలసిన అభివృద్ధి పనులపై ఆలయ ఈవో, ఎండోమెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లతో మాట్లాడుతూ మాలకొండపైకి వెళ్ళు మార్గంలో డబల్ రోడ్డు, కొండపైన అమ్మవారు గుడికి వెళ్ళు మార్గంలో నూతన మెట్ల నిర్మాణం,  ఎవరైనా ప్రముఖులు పుణ్యక్షేత్రానికి వచ్చిన సమయంలో వేద పండితులచే ఆశీర్వచనం కొరకు నూతన రూమ్ ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్ సదుపాయాలపై అధికారులు పలు సూచనలు చేశారు. మాలకొండ దిగువున ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల కొరకు చిన్నచిన్న రూములతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదన తయారు చేయాలని అధికారులు ఆదేశించారు.


 భక్తులకు అందించి అన్న ప్రసాదంలో  ఎక్కడ నిర్వహణలోపం ఉండరాదని  ఆదేశించారు. అన్న ప్రసాద నిర్వహణలో సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని  ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు సూచించారు.


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..