జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నకు హాజరైన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు
జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నకు హాజరైన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు
ప్రారంభమైన జడ్పీ సర్వసభ్య సమావేశం...
- పాల్గొన్న మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు
- ప్రజాప్రతినిధులకి స్వాగతం పలికిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో... సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిలతోపాటు...ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డి వి కృష్ణా రెడ్డి, కె రామకృష్ణలు, కలెక్టర్ ఆనంద్, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికై తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలను జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ గౌరవంగా సత్కరించి స్వాగతం పలికారు.