అందరి సహకారంతోనే అవార్డు దక్కింది: - కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి  ఎన్ డి సి సి బి చైర్మన్

రవి కిరణాలు తిరుపతి జిల్లా పెళ్ళకూరు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిల సహాయ సహకారాలతో పాటు జిల్లాలోని బ్యాంకు అధికారులు, సిబ్బంది, సొసైటి పాలకవర్గం అందరి సహకారంటో అద్వితీయమైన ప్రతిభ కనబరిచి సియం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అప్కాబ్ పుస్కారం తీసుకోవడం ఆనందం ఉందని ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సహకార బ్యాంకు అప్కాబ్ 60 సంవంత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో సియం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా సీఈవో శంకర్ బాబుతో కలసి అవార్డుతో పాటు ప్రశంస పత్రం చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్బంగా కామిరెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని రైతులకు డీసీసీబీ ద్వారా సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిదంగా అనేక సంస్కరణను తీసుకొచ్చి బ్యాంకును లాభల బాటులో నడుపుతున్నామని తెలిపారు. కొత్తగా వాహనాలు, గృహ రుణాలతో పాటు రైతు బిడ్డలు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు రుణాలు అందిస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బ్యాంకు ఉద్యోగుల నియమాకం జరగలేదని, నేడు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఉమ్మడి జిల్లాలోని మా బ్యాంకు పరిధిలో గల సంఘాలను లాభల బాటలో నడిపిస్తూ వాణిజ్య బ్యాంకులకు ధీటుగా రుణాలు అందిస్తున్నట్లు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.