కమనీయంగా శ్రీ కామాక్షి దేవి సమేత  ....

శ్రీ ఖరేశ్వరస్వామి స్వామి కల్యాణోత్సవం....

వెల్లివిరిసిన భక్తిభావం....

పులకించిన భక్తజనం....

    శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-

 మండల పరిధిలోని కోటపోలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి ఆలయ ఆవరణమంతా శనివారం సాయంత్రం శివ నామస్మరణతో మార్మోగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శోభిల్లింది. భక్తి భావం వెల్లివిరిసింది. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి కళ్యాణాన్ని తిలకించిన  భక్తులు పులకించిపోయారు. ఇక్కడి  శివాలయం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఖరేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు   కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైన కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి పరవశించారు .ఈ కల్యాణ  మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మండల అధ్యక్షుడు అల్లూరు అనీల్ రెడ్డి,తడ మండల అధ్యక్షుడు కొళివి రఘు, విచ్చేశారు. వారికి ఆలయ ధర్మకర్త గ్రిద్దటి శ్రీధర్ రెడ్డి,ఆలయ కార్యనిర్వాహకురాలు కుడిముడి మమత  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులచే అమ్మవారి, స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు గూడూరు వెంకటనాగ మల్లేశ్వరరావు పర్యవేక్షణలో యజ్ఞకులు మడమనూరు మల్లికార్జున గురుకులు,వేదపారాయణక పండితులు కాశీబాట్లశరత్ కుమార్ శర్మ స్వాములు కల్యాణ తంతు జరిపించారు.ఈ కళ్యాణ వేడుకలకు విచ్చేసిన మహిళా భక్తులకు ముత్యాల తలంబ్రాలు, పసుపు,కుంకుమ గాజులను అందజేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.ఈకార్యక్రమంలో కోటపోలూరు MPTC సత్యవేటి శ్రీజ, సర్పంచ్ కమతం అరుణ కుమారి, ఆరణి   విజయభాస్కర్ రెడ్డి, బద్ధిపూడి మోహన్ రెడ్డి,అల్లూరు రమేష్ రెడ్డి, మెల్లకంటి వీరాస్వామి, తనమాల వెంకటరమణారెడ్డి, తనమాల నారాయణరెడ్డి, కమతం గోవర్ధన్, పెరింబేటి వేణుగోపాల్, యర్రం మనోజ్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు.