పూర్వ విద్యార్థులతో కాకాణి సమావేశం

తేది:21-05-2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ లో తాను చదువుకున్న జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు.

నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేక దశాబ్దాలుగా పని చేస్తూ, సమాజంలో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, మా కళాశాల విద్యార్థి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగడం, తమ విజయంగా భావిస్తున్నామని, తాము ఎంతో గర్వపడుతున్నామని కళాశాల యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి, తాను చదువుకున్న కాలేజీకి మంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా రావడం, తమకు అంతులేని ఆనందాన్ని  కలిగిస్తుందంటూ, పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశంసించారు.

కాలేజీ యాజమాన్యం కాకాణికి సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు.

కాకాణి తనకు విద్యను అందించిన గురువులందరినీ ఘనంగా సత్కరించి, తన కృతజ్ఞతలు తెలియజేశారు.

కాకాణి తన ప్రసంగంలో తాను ఈ స్థాయికి చేరడానికి ఎంతోమంది ఆశీస్సులతో పాటు, తనకు విద్యను అందించిన విద్యాలయం పాత్ర కూడా ఉందని సవినయంగా తెలియజేశారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి విద్యార్థికి విద్యను అందించడం, తమకందరికీ సార్ధకత చేకూరిందని అధ్యాపకులు ప్రకటించారు.

పూర్వ విద్యార్థుల సమావేశానికి తనను ముఖ్య అతిధిగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపకులకు, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కు, పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

తనతో చదువుకున్న సహ విద్యార్థులతో కలిసి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంతో పాటు, కాలేజీలో కలియతిరిగి, మంత్రి కాకాణి  నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

పూర్వ విద్యార్థుల అభినందనలు, కేరింతల మధ్య ఆద్యంతం సమావేశం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది.